కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బలమైన పునాదులు వేసేలా అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం 12 గంటలు క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జమ్మిచెట్టు, సంకల్‌బాగ్, ఓల్డ్ పంప్‌హౌజ్‌ల వద్ద ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యలు చేపట్టాలని సూచించారు. మరో ఎస్టీపీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు.