అల్లూరి జిల్లా అరకు ఎంపీ చెట్టి తనుజరాని దృష్టికి అరకు పెద్దలబ్బుడు ప్రాంతానికి చెందిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల సమస్యలను వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పాడేరు ఎంపీ కార్యాలయానికి చేరుకున్న వారంతా గత 20 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న తమకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం లేదని, సంబంధిత శాఖల అధికారులు దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని వారంతా ఎంపీ తనుజరానికి వెల్లడించారు. దీంతో ఆమె ఫోన్లో సబ్ కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా సూచించారు.