ఇంటర్ తరగతులు ప్రారంభమై 4నెలలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని KVPS జిల్లా కార్యదర్శి దినకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ..అసలే కొమురం భీం జిల్లా విద్యా పరంగా,ఆర్థిక పరంగా వెనుక బడిన జిల్లా అని కొనియాడారు. వెనుక బడిన జిల్లాను విద్య పరంగా ముందుకు తీసుకెళ్లాలి.కానీ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు అందించడంలో విఫలమైందన్నారు.