యానాం సరిహద్దు లోని నీలపల్లి చెక్ పోస్ట్ వద్ద మురళి నగర్ లో సోమవారం రాత్రి యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటనపై యానాం, కోరంగి పోలీసుల ఘటనా స్థలికి చేరుకుని సంయుక్తంగా విచారణ చేపట్టారు. యువకుడి ముఖం ఇసుకలో కూరుకుపోవడంతో మృతదేహాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. యువకుడికి సుమారు 30 ఏళ్లు ఉంటాయని పోలీసులు అంచనా వేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.