ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయుల విభాగంలో భాగంగా రాజుపాలెం మండలం కోట నెమలిపురి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శైలజ శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఎప్పుడు కూడా అవార్డుల కోసం పనిచేయలేదని తన పనిని ఎప్పుడూ కూడా సక్రమంగా నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో అంకితభావం వాత్సల్యం కలిగి ఉండాలనీ విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఉపాధ్యాయులు పని చేయాలన్నారు.