YSR నగర్ పోలీసుల తనిఖీలు వేదాయపాళెం పోలీస్ స్టేషన్ పరిధిలోని YSR నగర్ లో ఆదివారం ఉదయం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వారిని విచారించారు. సరైన పత్రాలు లేని 21 బైక్లు, ఆటోలు-3 స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.