పీపీపీ మోడల్ ద్వారా కూటమి ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 10 మెడికల్ కాలేజీల టెండర్లలో పాల్గొనొద్దంటూ జగన్ హెచ్చరికలు చేయడంపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పెనుకొండలో మంత్రి మాట్లాడుతూ.. జగన్ బెదిరింపులకు రాష్ట్రంలో భయపడే వారెవరూ లేరన్నారు. జగన్ ఏ ఒక్క మెడికల్ కాలేజీని పూర్తిస్థాయిలో నిర్మించలేదన్నారు. సీఎం చంద్రబాబు 10 మెడికల్ కాలేజీలను నిర్మించాలని నిర్ణయించారని తెలిపారు.