విశాఖ ఉక్కు పై వైకాపా మరియు సిపిఎం వామపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను ప్రజాక్షేత్రంలో తిప్పి కొడతామని గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అన్నారు.గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్లు మాట్లాడుతూ..వైకాపా ఇచ్చిన చిల్లరకు ఆశపడి సిపిఎం మరియు వామపక్ష యూనియన్లు, కార్మికులు మరియు నిర్వాసితుల్లో పథకం ప్రకారం గందరగోళం సృష్టించే ప్రక్రియకు శ్రీకారం చుట్టరన్నారు. ప్రస్తుతం వారి మాటలను నమ్మే పరిస్థితులు గాజువాక ప్రజలు లేరని అన్నారు. స్టీల్ ప్లాంట్ కు 2500 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు మాఫీ చేసిన సంగతి గుర్తు చేశారు.