,విదేశ శీతల పానీయాలకు బదులుగా చెరకు రసం, కొబ్బరి నీళ్లు వంటి తాజా పానీయాలు తాగాలని కడప జిల్లా చెన్నూర్ మండల బీజేపీ ఉపాధ్యక్షులు గోవింద్ గణేష్ ఆదివారం ప్రజలకు ప్రకటన ద్వారా సూచించారు. దీనివల్ల దేశీయంగా రైతులకు ఆదాయం లభిస్తుందని, రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయని తెలిపారు. విదేశీ వస్తువుల కొనుగోలును 90 రోజులు ఆపివేస్తే భారతదేశం ఆర్థికంగా బలపడుతుందని, ఆయన తెలిపారు. ఈ సందేశాన్ని అందరికీ చేరవేయాలని ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.