దేవనకొండ మండల కేంద్రంలోని పలు కాలనీలు అశుభ్రంగా ఉండటంపై శనివారం పట్టణ టీడీపీ ఉపాధ్యక్షుడు కుక్కల తిమ్మయ్య, ఇన్ఛార్జి ఎంపీడీవో గోపాల్తో వాగ్వాదానికి దిగారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పేరుతో ప్రభుత్వం అనుకున్న ఫలితాలు సాధించడంలేదని, కాలనీలలో చెత్తతో నిండిపోయాయని, గ్రామంలో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని ఆరోపించారు