సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కడప జిల్లా బద్వేలు మండల సమితి ఆధ్వర్యంలో సోమవారం బద్వేల్ తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వడ్డమాను వీరశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ఎరువుల కేటాయింపులో రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అధిక ధరలకు విక్రయించే డీలర్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.కేంద్ర నుంచి వచ్చిన యూరియాను 80 శాతం ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపులకు తరలిస్తున్నారని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.