నంద్యాల పట్టణంలోని రూ.1.40 కోట్ల తో పద్మావతి నగర్ నూతన సీసీ రోడ్డును గురువారం మైనార్టీ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ లాంచనంగా పూజ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ మాట్లాడుతూ తక్కువ సమయంలో ఇంత నాణ్యతగా సిసి రోడ్డును నిర్మించడం పిఏవి గ్రూప్ చైర్మన్ కాంట్రాక్టర్ పబ్బతి వేణు గోపాల్ అభినందనీయమన్నారు. అనంతరం పబ్బతి వేణుగోపాల్ ను మంత్రి ఫరూక్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా పబ్బతి వేణుగోపాల్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో సహకరించిన షాపు యజమానులు, మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.