ఏపీ వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి గుమ్మలపాడు గ్రామంలో గురువారం పర్యటించారు. తెలంగాణలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన 20 మంది గ్రామస్థులతో మాట్లాడారు. ఇంటిలో చికిత్స తీసుకుంటున్న బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొల్లేరు ప్రజల జీవనోపాధి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.