జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ప్రాదేశిక ఎన్నికల కోసం జిల్లాలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,457 పోలింగ్ బూత్ లను గుర్తించారు. గ్రామాల వారీగా పోలింగ్ బూత్ ల జాబితాను విడుదల చేశారు. అభ్యంతరాలను 8వ తేదీ వరకు స్వీకరించి, 9న పరిష్కరిస్తారు. 10వ తేదీన తుది జాబితాను విడుదల చేస్తారు.