వైద్య,ఆరోగ్య శాఖలో పనిచేసే ఏఎన్ఎంలపై పనిభారాన్ని తగ్గించాలని, యాప్ ల నుంచి విముక్తి కల్పించాలని ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ..NCD ఆన్లైన్ ప్రోగ్రాం చేయడం వలన ANM లకు పని భారం పెరిగిందన్నారు. దీంతో ఏఎన్ఎంలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. పేద ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఏఎన్ఎంల పాత్ర ఎంతో ముఖ్యమైందని అన్నారు. అటువంటి ANM లేకె సెక్యూరిటీ లేకపోవడంతో కుటుంబ పోషణ భారమంటుందన్నారు.