జమ్మికుంట పట్టణంలోని ఎరువుల దుకాణాలను గురువారం సాయంత్రం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ టీం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని ప్రాథమిక సహకార సంఘం నిర్వహిస్తున్న ఎరుల దుకాణంలో తనిఖీ చేసి అమ్మకాల రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా భాగ్యలక్ష్మి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ షాప్ లో ఎరువుల నిలువల గురించి తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా రైతులకు ఆధార్ కార్డు పై మాత్రమే యూరియా అమ్మకాలు జరుపుతున్నారా లేదా అని పరిశీలించారు.ఈ తనిఖీలో సీఐ వరుణ ప్రసాద్ శ్రీకాంత్ రెడ్డి నారాయణ అశోక్ తో పాటు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.