జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రామాయంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు అక్కన్నపేట లోని రైల్వే స్టేషన్లలో నర్కోటిక్ డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. రామయంపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజు గౌడ్, ఎస్సై బాలరాజు లు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. అనంతరం సిఐ మీడియాతో మాట్లాడుతూ ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పదమైన వస్తువులు లభించలేదు అని, ఈ ఆకస్మిక తనిఖీల ముఖ్య ఉద్దేశం ప్రజల్లో భద్రత భావాన్ని పెంపొందించడం తోపాటు రాబోయే గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిపించడం కోసం నిర్వహించడం జరిగిందన్నారు.