రాయచోటి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పాలనకు కొత్త దారులు చూపిన మహానేత డా. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను స్మరించారు. పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కోసం ఆరోగ్యశ్రీ, అత్యవసర వైద్యానికి 108 సేవలు, రైతులకు ఉచిత విద్యుత్, మైనార్టీలకు 4% రిజర్వేషన్, జలయజ్ఞం పేరుతో భారీ ప్రాజెక్టుల నిర్మాణం వంటి అనేక విప్లవాత్మక సంస్కరణలు వైయస్సార్ తీసుకొచ్చారని పేర్కొన్నారు.నక్సలిజాన్ని రూపుమాపి రాష్ట్రంలో శాంతిభద్రతలను గాడిలో పెట్టిన మహానేత వైయస్సార్ అని కొనియాడారు.