అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో జరుగుతున్న వినాయక చవితి వేడుకలలో భాగంగా రెండవ రోజు గురువారం స్వామివారి సన్నిధిలో కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఆధ్యాత్మిక గీతాలకు లయబద్ధంగా కళాకారులు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనను భక్తులు ఆసక్తిగా వీక్షించారు. కళాకారులను ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దుర్గాభవాని అభినందించారు.