కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులో శనివారం జాతీయలోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ మాట్లాడుతూ కక్షిదారులు తమ కేసులను పరిష్కారం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కేసులో పరిష్కారం అవుతాయన్నారు. గ్రామాలలో ఉన్న ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. ఒకరిపై ఒకరు కేసులను పెట్టుకోవద్దని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు