పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఒకరికి ఒక న్యాయం మరొకరికి ఒక న్యాయంగా వ్యవహరిస్తున్నారని పాడేరు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చింతల వీధి వద్ద వినాయక నిమర్జనం ఉత్సవాల్లో భాగంగా నిన్న జరిగిన స్కార్పియో ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు సంఘీభావంగా అక్కడికి చేరిపిన మీ నిరసనలో కూర్చున్నారు. మృతుల కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని, అతివేగంగా వాహనం నడిపి ప్రమాదానికి గురైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.