అనంతపురం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఈనెల 25వ తేదీన వజ్రకరూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పామిడికి చెందిన మొహమ్మద్ రఫీ అనే యువకుడు చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పామిడి కి చెందిన తన బంధువుతో కలిసి ద్విచక్ర వాహనంలో వజ్రకరూర్ కు వెళ్ళగా ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో తీవ్రంగా గాయపడి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.