నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రతిష్టించే కర్ర వినాయకుని విగ్రహ ప్రతిష్టాపన కరపత్రాలను కర్ర పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిలమంతుల రాజలింగం, కొలిప్యాక అంజయ్య మాట్లాడుతూ... ఈనెల 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కర్ర వినాయకుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుందని నాలుగవ తేదీన నిమజ్జనం పట్టణ పురవీధుల గుండా శోభా యాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతిరోజు బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలో హోమ కార్యక్రమాలు అన్నప్రసాద వితరణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్ల