కోడుమూరు నియోజకవర్గ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. వీధివీధినా వినాయక మండపాలను ఏర్పాటు చేశారు. విగ్రహాలను కొలువుదీర్చి వేదమంత్రాల మధ్య పూజలు నిర్వహించారు. ప్రజలు మండపాల వద్ద గణనాథునికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. వేడుకల్ని పురస్కరించుకుని వినాయక మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చిన్నారుల సందడి నెలకొంది.