రామగిరి మండలం లోని బేగంపేట లో 330 యూరియా బస్తాలు అందుబాటులో ఉండగా 110 మంది వరకు రైతులకు మరియు, లగ్నాపూర్ లో 270 బాగ్స అందుబాటులో ఉండగా 90 మంది రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారుల సమక్షంలో రైతులకు టోకెన్ వారీగా యూరియా బస్తాలను అందజేశారు. లదనాపూర్ మరొక 20 మంది రైతులకు టోకెన్స్ ఇచ్చినారు. వారికి రేపు బేగంపేట్ ఎరువుల దుకాణం లో అందజేస్తామన్నారు. అలాగే మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ ఆధ్వర్యంలో బేగంపేట్ లో రైతులకు నానో యూరియా ను అందజేశారు.