అనంతపురంలో జరుగుతున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పడం సంతోషించదగ్గ విషయమని పులివెందుల నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దసరా రోజున ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద 15 ఆర్థిక సహాయం చేస్తున్నామని ప్రకటించారని చెప్పారు. దీంతో ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం తో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని చెప్పారు.