యాదాద్రి భువనగిరి జిల్లాలోని భారీ వర్షాలకు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద ఉన్న లో లెవల్ వంతెన పైనుంచి నీరు పోటెత్తుతుంది. దీంతో బీబీనగర్ పోచంపల్లి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్తగా వంతెనకు ఇరువైపులా భారీ కేట్లను ఏర్పాటు చేశారు. ఎవరు వర్ధనేటిలోకి వెళ్లకుండా పరిరక్షణ చేస్తున్నారు. వరద తగ్గిన తర్వాతనే రాకపోకలు పునరుద్ధరిస్తామని తెలిపారు.