కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పరిధిలోని బి.కోడూరు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పి అశోక్ కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులు సమస్యల పరిష్కారానికి శ్రమపడి జిల్లా కేంద్రం వరకూ రాకుండా స్టేషన్ లోనే పరిష్కరించి న్యాయం చేయాలని ఆదేశించారు. సి.సి.టి.ఎన్.ఎస్ ను అప్ డేట్ చేయాలనిఎస్ఐ వెంకట సురేష్ ను ఆదేశించారు. శక్తి టీముల ఏర్పాటు గురించి ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞాన్ని విస్తృతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఎస్.ఐ కి సూచించారు.బి.కోడూరు స్టేషన్ పరిధిలో సిసి టివి కెమెరాలను ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు.