ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఆర్టీసీ బస్టాండ్ ను గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమణ చేసినట్లు శుక్రవారం ఎమ్మార్వో నారాయణరెడ్డి కి డిపో మేనేజర్ శ్రీనివాసరావు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని తిరిగి ఆర్టీసీకి వచ్చేలా చూడాలని ఆయన ఎమ్మార్వో కు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మార్వో నారాయణరెడ్డి వీఆర్వోలను పిలిపించి సర్వే కి పంపారు. స్థలాన్ని ఆక్రమణకు గురికాకుండా చూస్తామని తిరిగి ఆర్టీసీకి వచ్చేలా చూస్తామని నారాయణరెడ్డి డిపో మేనేజర్ కు తెలిపారు.