ప్రస్తుత మార్కెట్ లో తినుబండారాల నుండి మొదలుకొని ఏ సామాగ్రి చూసినా నకిలీ సామగ్రి హావా కొనసాగుతోంది. తాజాగా ఆదిలాబాద్ లో నకిలీ డిటర్జెంట్ పౌడర్ దందా బట్టబయలు అయింది. నకిలీ డిటర్జెంట్ పౌడర్ లాట్ ను తరలిస్తున్న వాహనాన్ని స్థానిక ఓ వ్యాపారి గుర్తించారు. ఘడి కంపెనీ డిటర్జెంట్ పౌడర్ పేరుతో మార్కెట్ లో విక్రయించేందుకు నకిలీ పౌడర్ ను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పట్టుబడ్డ వాహనంలో పెద్ద ఎత్తున నకిలీ డిటర్జెంట్ పౌడర్ ప్యాకెట్ల ను స్వాధీనం చేసుకున్నారు.