ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన OG చిత్రం గురువారం విడుదల కావడంతో అభిమానులు ఆదిలాబాద్లోని థియేటర్లలో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ భారీ కట్ ఔట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకం, కేక్ కట్ చేశారు. జై బాబు నినాదాలతో హోరెత్తించారు. తమ అభిమాన నటుడు స్టైలిష్గా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. సినిమా భారీ విజయం సాధిస్తుందని అభిమానులు తెలిపారు.