శ్రీ సత్య సాయి జిల్లా కదిరి లోని రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం సిఐ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన కదిరి డిఎస్పి శివ నారాయణస్వామి ఆధ్వర్యంలో వినాయక మండప నిర్వాహకులతో పెద్దలతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రజలు, మండప నిర్వాహకులు శాంతియుతంగా జరుపుకోవాలని తెలియజేశారు.