జీవో 69 లో భాగంగా భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు నష్టపరిహారం రూ. 20 లక్షల పెంచిన సందర్భంగా నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మల్ రెడ్డి పల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివ కుమార్ రెడ్డి చిత్రపటాలకు శనివారం 12 గంటల సమయంలో రైతులు పాలభిషేకం చేశారు.