కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్ లో కరెంట్ షాక్ తో బుధవారం ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కొత్తపల్లిలోని చింతకుంట ప్రగతినగర్ కు చెందిన ఉన్నోజు రమేష్ కరీంనగర్ ఆటోనగర్ లో లెట్ మిషన్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో షాపులో పనిచేస్తూ ఉండగా లేట్ మిషన్ కరెంట్ వైర్ తెగడంతో రమేష్ విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతుడి భార్య రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తము కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.