ప్రకాశం జిల్లా కొమరోలు పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం ఎస్ఐ నాగరాజు గణేష్ ఉత్సవ్ వెబ్ సైట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రజలను పిలిపించి అనుమతులపై వాటి వివరాలను వెల్లడించారు. వెబ్ సైట్ లో కమిటీ మెంబర్ల వివరాలు విగ్రహాన్ని ఇన్ని రోజులు ఏర్పాటు చేస్తాము సమాచార పొందుపరచాలని అన్నారు. శాంతియుతంగా పండగ జరుపుకొని పోలీసులకు సహకరించాలని ఎస్సై నాగరాజు విజ్ఞప్తి చేశారు.