విజయవాడ వాసులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి సంవత్సరం పూర్తైందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాశ్ ఆరోపించారు. ఆదివారం ఆయన తాడేపల్లిలో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే 2024లో బుడమేరుకు వరద వచ్చిందన్నారు. వరదలలో సర్వం కోల్పోయిన బాధితులు ఇప్పటికీ నిలదొక్కుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని, బాధితులకు న్యాయం చేయలేదన్నారు.