శనివారం మధ్యానం గద్వాల పట్టణ సమీపంలోని దౌదర్పల్లి దగ్గర నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇందిరమ్మ ఇళ్ళను మంత్రులు చేతుల మీదుగా గృహప్రవేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పాటుపడుతున్నట్లు తెలిపారు. గత పది సంవత్సరాలలో నిరుపేదలకు ఇల్లు కట్టించాలని తపన ఆనాటి ప్రభుత్వానికి లేదని ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 3500 మంజూరు చేసిందని తెలిపారు.