6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జరుగుతున్న మండల స్థాయి క్రీడా పోటీలు నేటితో ముగిశాయని మండల విద్యాధికారి విద్యాసాగర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. క్రికెట్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ వంటి వివిధ క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులు రేపటి నుంచి జరిగే జిల్లా స్థాయిలో పాల్గొనాలని పేర్కొన్నారు.