కేంద్ర ప్రభుత్వం జిఎస్టి స్లాబ్ లను నాలుగు నుంచి రెండుకు తగ్గించడం ప్రజలకు దసరా మరియు దీపావళి కానుక అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గురువారం రాజమండ్రి బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, నిత్యవసర వస్తువులు, వ్యవసాయ పరికరాలు, ముఖ్యంగా ట్రాక్టర్లు అలాగే 33 రకాల ఔషధాలపై జిఎస్టి ని 18 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించిందన్నారు. ఈ నిర్ణయం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.