ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మండలం బరంపూర్ లోని ఓ వ్యవసాయ బావి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు. ఆదిలాబాద్ రాంనగర్ కు చెందిన దేవి ప్రసాద్ అనే వ్యక్తి బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. కాగా ఇదే బావిలో మృతుడి భార్య సుహాసిని నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఆ విషయమై దేవి ప్రసాద్ పై కేసు నమోదైంది. కాగా ప్రసాద్ ఆత్మహత్యలకు గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది.