జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు ఛాంబర్లో ఎయిడ్స్ పై అవగాహనకు 5కె మారథాన్ ర్యాలీ విజేతలకు నగదు, ప్రశంసా పత్రాలను కె.వెట్రిసెల్వి అందించి అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ దేశ భవిషత్తు యువత చేతిలో ఉందని, యువత మంచి ఆలోచలతో అడుగులు వేసి దేశ,రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎయిడ్స్ వ్యాప్తి అరికట్టడానికి, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు మద్దతుగా నిలవడానికి మారథాన్ 5 కే రెడ్ రన్ ను ర్యాలీని ఒక సాధనంగా చూడాలన్నారు.