ములుగు జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.వి.పి సూర్య చంద్రకళ నేడు శుక్రవారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. రేపు అనగా 13 వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీమార్గమే రాజ మార్గం అని, లోకదాలత్ లో ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని, కేసుల పరిష్కారం కోసం నాలుగు బెంచ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిలో రాజీపడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాలు, మోటార్ వెహికిల్ తదితర కేసులు పరిష్కరించబడతాయని అన్నారు.