Parvathipuram, Parvathipuram Manyam | Aug 22, 2025
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని పెద్ద బజారులో వ్యాపారం నుండి 5 కేజీల మేక మాంసం, 10 కేజీల కోడి మాంసాన్ని మున్సిపల్ అధికారులు, సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని పెదబజారులో మాంసం మరియు చేపల దుకాణాలను మున్సిపల్ కమిషనర్ రత్నకుమార్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, సిబ్బంది ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొన్ని దుకాణాలలో అపరిశుభ్రమైన వాతావరణంలోను అలాగే ఈగలు వాలకుండా జాల్ లు కట్టకుండా మాంసం అమ్ముతుండడాన్ని గుర్తించారు. వారి నుండి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.