ఆదోని మండలం మండగిరి పంచాయతీ పరిధిలో 150 ఎకరాల్లో వర్షపు నీరు చేరడంతో రైతులు లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అధికారుల దృష్టికి వెళ్లడం జరిగిందని రైతులు తెలిపారు. సానుకూలంగా స్పందించిన అధికారులు, అధికారులను పంపిస్తామని అన్నారు. పక్కనే నేషనల్ హైవేకు దగ్గర్లో ఉన్న జగనన్న కాలనీ రోడ్డులో ఉన్న పొలాల్లో కాలువలు లేక భారీగా పంట పొలాల్లో నీరు చేరడంతో రైతులు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు