ఆదిలాబాద్ లోని రవీంద్రనగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో ఓనం వేడుకలను కేరళ సంప్రదాయం ప్రకారం శుక్రవారం వైభవంగా జరిపారు. దామోదర్ గురుస్వామి వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా జరిపారు. ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులతో ఆలయ ప్రాంగణం కిట కిట లాడింది.భక్త జనం భక్తి గీతాలను ఆలపిస్తూ భక్తి భావాన్ని చాటుకున్నారు. అనంతరం మహా హారతి, మెట్ల పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.