రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డివిజన్లోని బంజారా కాలనీ వర్ధనేటితో మునిగిపోయింది.ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి శుక్రవారం బంజారా కాలనీలోని నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్లు సరైన సమయంలో వర్ధనీటి కాలువల నిర్మాణ పనులు చేపట్టకపోవడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అధికారులు వర్ధన్నటి కాలువ నిర్మాణ పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.