లంబాడీలు ఎస్టీ లు కాదని సుప్రీం కోర్టు పిటిషన్ దాఖలు చేసి ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించేందుకు పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, సోయం బాపూరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కు ఆదివాసులు అండగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ లో రాజ్ గోండు సేవ సమితి సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. ఎస్టీ జాబితాలో నుండి లంబాడాలను తొలగించాలని ఇటీవల సుప్రీం కోర్టు ను ఆశ్రయించిన సోయం బాపూరావు, తెల్లం వెంకటరావు చిత్రపటాలకు శనివారం పాలభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వలసలు లంబాడిలు ఎవరైతే ఉన్నారో వారందరిని ఎస్టీలు కాదని రాజ్ గోండు సేవ సమితి రాష్ట్ర ఉపాధ్యక్ష