గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ కృపాలక్ష్మినే అని ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్యామరాజ్ తెలిపారు. గురువారం ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. కొన్ని ఛానళ్లలో ఇన్‌ఛార్జ్‌ను మారుస్తున్నట్లు అసత్య ప్రచారం జరుగుతుందని, అందులో ఎలాంటి వాస్తవం లేదన్నార. వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయాలని ఆయన హితవు పలికారు.