Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 29, 2025
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఘనపుర మండలం నగరంపల్లి వద్ద గల ముసర్లకుంట తెగిపోవడంతో నగరంపల్లి- అప్పయ్య పల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు గ్రామ రైతులు, బిజెపి కార్యకర్తల సహకారంతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టినట్లు బిజెపి మండల అధ్యక్షుడు నవీన్ రావు తెలిపారు. స్కూల్ వ్యాన్లు, ఆటోలు ప్రయాణానికి ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో రోడ్డు మరమ్మత్తు చేపట్టినట్లు తెలిపారు నవీన్ రావు.