యానాం కనకాలపేట వాటర్ ట్యాంక్ లో మంగళవారం జరిగిన క్లోరిన్ గ్యాస్ లీక్ ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఘటనపై ప్రజా పనుల శాఖ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ట్యాంక్ లో ఉన్న మంచి నీరు పరీక్షలు కి పంపినట్లు రిపోర్ట్ వచ్చిన వెంటనే మంచి నీరు సరఫరా చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.